ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు ఈ ఏడాది అత్యంత గడ్డుకాలం ఎదుర్కోనున్నట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది మొత్తం మీద విమానయాన సంస్థలు 84.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.36 లక్షల కోట్లు) నష్టాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేసింది. కరోనా వైరస్‌తో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో.. విమానయాన రంగ చరిత్రలోనే 2020ని అత్యంత దారుణమైన ఏడాదిగా అభివర్ణించింది ఐఏటీఏ.
విమాన సంస్థలకు 2020లో రూ.6.36 లక్షల కోట్ల నష్టం!
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది విమానయాన సంస్థలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోనున్నట్లు విమానయాన రంగ విభాగం ఐఏటీఏ తెలిపింది. ఈ ఏడాది మొత్తం మీద విమానయాన సంస్థలు రోజుకు సగటున 230 మిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకోవచ్చని అంచనా వేసింది.
కరోనాతో విమానయాన రంగం కుదేలు
ఐఏటీఏ మరిన్ని అంచనాలు..
- ఈ ఏడాది రోజుకు 230 మిలియన్ డాలర్ల నష్టం నమోదు కావచ్చు.
- ఆదాయం కూడా 2019తో పోలిస్తే 2020లో 50 శాతం తగ్గి.. 838 బిలియన్ డాలర్ల నుంచి 419 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చు.
- 2021లో విమానయాన రంగం నష్టాలు 15.8 బిలియన్ డాలర్లకు తగ్గొచ్చు. ఆదాయం 598 బిలియన్ డాలర్లుకు పెరిగే అవకాశాలున్నాయి.
- ఈ ఏడాది మొత్తం మీద 220 కోట్ల మంది విమానాల్లో ప్రయాణం చేయొచ్చు. వీరిలో ఒక్కో ప్యాసింజర్‌పై విమాన సంస్థలకు 37.54 డాలర్ల నష్టం రావచ్చు.