తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెరాస వచ్చాకే చిల్లర రాజకీయాలు షురూ: సంపత్​ - sampath kumar

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ చేసే ప్రచార రాజకీయాలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మండిపడ్డారు. మహబూబ్​నగర్​, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్​ చేపట్టిన ప్రచారంలో తమకు మంచి స్పందన లభించిందన్నారు.

తెరాస చిల్లర రాజకీయాలు చేస్తోంది: సంపత్​కుమార్

By

Published : Apr 7, 2019, 8:34 PM IST

ఎన్నికలంటే... మంచి హుందాతో కూడిన ప్రచార సరళి ఉండేదని తెరాస పార్టీ వచ్చిన తర్వాత చిల్లర రాజకీయాల వాతావరణం వచ్చిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ మండిపడ్డారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన సంపత్​.. అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. కేసీఆర్​ ప్రజలను మభ్యపెడుతూ... మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

తెరాస చిల్లర రాజకీయాలు చేస్తోంది: సంపత్​కుమార్

ABOUT THE AUTHOR

...view details