తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'నకిలీలను గుర్తించండి... పీడీ యాక్ట్​లు పెట్టండి' - agriculture review

రైతులకు నష్టం కలిగించే నకిలీ, అనుమతి లేని విత్తనాలపై ఉక్కు పాదం మోపాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. టాస్క్​ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

agriculture-review

By

Published : May 7, 2019, 9:19 PM IST

'నకిలీలను గుర్తించండి... పీడీ యాక్ట్​లు పెట్టండి'

నకిలీ, అనుమతి లేని విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్‌లోకి రాకుండా చూడాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి పేర్కొన్నారు. హైదరాబాద్​లోని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శిక్షణ సంస్థలో ఏర్పాటు చేసిన విత్తన టాస్క్​ఫోర్స్ బృందాల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జ, పోలీసు శాఖ ఐజీ వై.నాగిరెడ్డి, ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ సంచాలకులు డాక్టర్ కె.కేశవులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

విస్తృతంగా సోదాలు చేయండి

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ దృష్ట్యా... విత్తన చట్టం, నమూనా పరీక్షా విధానం, విత్తన ట్యాగ్ రకాలు వంటి అంశాలపై పోలీసు శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. టాస్క్‌ఫోర్స్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి నకిలీ, అనుమతి లేని విత్తనాలు నిరోధించడం, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్థసారథి సూచించారు.

పీడీ చట్టం ప్రయోగించండి

రైతులు అనుమతి కలిగిన విక్రయ కేంద్రాల్లో మాత్రమే నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పత్తిలో అనుమతి లేని విత్తనాలను అక్రమంగా నిల్వ ఉంచిన, విక్రయించిన టాస్క్‌ఫోర్స్ బృందాలు గుర్తించి... బాధ్యులపై పీడీ చట్టం ప్రయోగించడం, లైసెన్సుల రద్దు, అరెస్టులు లాంటి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో విత్తన దుకాణాలు, శుద్ధి పరిశ్రమలు, గోదాములు, ఇంకా అనుమానాస్పద ప్రాంతాల్లో కూడా దాడులు చేయాలని పార్థసారథి సూచించారు.

ఇదీ చూడండి: 'కేసీఆర్​తో చర్చలు అర్థవంతంగా జరిగాయి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details