అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో నిందితుడు రాజీవ్ సక్సెనాకు బెయిల్ మంజూరుపై నేడు దిల్లీ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. లుకేమియా వ్యాధి తీవ్రమైందని బెయిల్‌కు అభ్యర్థించారు రాజీవ్ సక్సేనా. ఈ అభ్యర్థన పరిశీలించిన న్యాయస్థానం.. అతడి ఆరోగ్య పరిస్థికికి సంబంధించిన ఓ నివేదికను బుధవారం 2 గంటల్లోగా ఇవ్వాల్సిందిగా ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది.
అగస్టా నిందితుడు రాజీవ్ సక్సెనాకు బెయిల్ నిర్ణయం నేడే - అగస్టా కుంభకోణం
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ సక్సెనాకు బెయిల్ మంజూరుపై నేడు నిర్ణయం తీసుకోనుంది దిల్లీ కోర్టు.
అగస్టా నిందితుడు రాజీవ్ సక్సెనాకు బెయిల్ నిర్ణయం నేడే
సక్సేనా బెయిల్ పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
నిందితుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని, రోగ నిరోధక శక్తి సైతం పడిపోయిందని రాజీవ్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.