నరేంద్ర మోదీని కీర్తిస్తూ అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజీన్ కథనాన్ని ప్రచురించింది. ప్రధానిగా భారత్‌ను మోదీ ఐక్యం చేశారంటూ రాసింది.
ఇదే టైమ్ మ్యాగజీన్ ఈ నెల మొదట్లో 'డివైడర్ ఇన్ చీఫ్' శీర్షికతో మోదీకి వ్యతిరేకంగా ఓ కథనాన్ని ప్రచురించింది.
తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడడం, ఎన్డీఏ ఘన విజయం సాధించడం వల్ల దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇండియా ఐఎన్‌సీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మనోజ్ లాడ్వా.. మోదీపై సానుకూల కథనాన్ని టైమ్‌లో రాశారు. మోదీ భారత్‌ను ఐక్యం చేసినంతగా దశాబ్దాల నుంచి ఏ ప్రధాని చేయలేదంటూ కీర్తించారు.
"మోదీ విధానాలపై గత ఐదేళ్లలోనూ, ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక విమర్శలు వచ్చాయి. కానీ భారత ఓటు బ్యాంకును మోదీ ఏకం చేసినంత.. గత ఐదు దశాబ్దాల చరిత్రలో ఏ ప్రధాని చేయలేదు."
-లాడ్వా కథనంలోని ఓ భాగం
మనోజ్ లాడ్వా.. 2014 ఎన్నికల్లో మోదీ ప్రచార బృందంలో సభ్యుడు. ప్రచార బృందానికి చెందిన పరిశోధన, సందేశాల విభాగానికి నేతృత్వం వహించారు.
"భారత పాలనా వ్యవస్థలో ఉన్న అవినీతి అనే అతిపెద్ద చిల్లులను తొలి ఐదేళ్ల కాలంలో మోదీ పూడ్చేశారు. రానున్న దశాబ్దాల్లో సరైన విధంగా ముందుకెళ్లేందుకు వీలుగా .. వ్యవస్థలను మార్చేందుకు మరింత కఠినంగా వ్యవహరించాలి. ఆచరణాత్మక రాజకీయవేత్తగా, ప్రచార ఆర్భాటాలకు దూరంగా రెండో దఫా పాలనాకాలంలో వ్యవహరించాలి."
-లాడ్వా కథనంలోని ఓ భాగం
ప్రపంచ సంస్థలు గుర్తించాయి