డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ ఎంగిడి.. పక్కటెముకల గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో ఈ గాయమైంది. సుమారు నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఎంగిడికి డాక్టర్లు సూచించారు.
సీఎస్కే బౌలర్ ఎంగిడికి గాయం.. సీజన్ మొత్తానికి దూరం - ఐపీఎల్ 2019
గతేడాది తన ప్రదర్శనతో ఆకట్టుకున్న చెన్నై జట్టు బౌలర్ ఎంగిడి. గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
సీఎస్కే బౌలర్ ఎంగిడికి గాయం
శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో బౌలింగ్ చేసినప్పుడు ఎంగిడి అసౌకర్యంగా కనిపించాడు. వెంటనే పరీక్షలు నిర్వహించాం. అతడికి పక్కటెముకల్లో గాయమైనట్టు తేలింది -మహమ్మద్ ముసాజీ, దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్
22 ఏళ్ల ఎంగిడి.. గత సీజన్లో చెన్నై తరఫున ఏడు మ్యాచ్‌లాడి 11 వికెట్లు తీశాడు.