భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వాస్తవ సారాంశాన్ని సీనియర్ నేత లాల్‌కృష్ణ అడ్వాణీ తక్కువ వాక్యాల్లో సంపూర్ణంగా చెప్పారని కీర్తించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ నెల 6న భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన బ్లాగులో సందేశాన్ని రాశారు అడ్వాణీ . దీనిపై స్పందించారు ప్రధాని మోదీ.
అడ్వాణీ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ - ప్రధాని మోదీ
భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అగ్రనేత ఎల్కే అడ్వాణీ బ్లాగు ద్వారా ఇచ్చిన సందేశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. భాజపా సిద్ధాంతాల వాస్తవ సారాంశాన్ని అడ్వాణీ సంపూర్ణంగా చెప్పారని అన్నారు.
ప్రధాని మోదీ
" భాజపా సిద్ధాంతాల సారాంశాన్ని అడ్వాణీ సంపూర్ణంగా, చక్కగా చెప్పారు. 'దేశం ప్రథమం, తరువాత పార్టీ, చివరన సొంత ప్రయోజనాలు' అంటూ కచ్చితంగా పాటించాల్సిన మార్గనిర్దేశక సూత్రాలను అడ్వాణీ బోధించారు. అడ్వాణీ లాంటి మహానేతలు పటిష్ఠం చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు గర్వపడుతున్నా." -- ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
ట్వీట్‌తో పాటు అడ్వాణీ బ్లాగు లింకును షేర్ చేశారు ప్రధాని మోదీ.
Last Updated : Apr 5, 2019, 7:42 AM IST