తెలంగాణ

telangana

ETV Bharat / briefs

డ్రైవర్​ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి - ACCIDENT

డ్రైవర్​ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకొంది. డీజిల్​​ పోయడానికి వచ్చిన సిద్ధార్థ కంపెనీకి చెందిన ట్యాంకర్ డ్రైవర్​​ చూడకుండా ముందున్న పెంటయ్యను తొక్కించాడు. తీవ్రగాయాలైన పెంటయ్య ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గమధ్యలో మరణించాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా పత్తిపూర్​లో చోటుచేసుకుంది.

డ్రైవర్​ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

By

Published : May 3, 2019, 4:48 PM IST

డ్రైవర్​ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

రంగారెడ్డి జిల్లా పత్తిపూర్​ గ్రామ శివారులోని హెచ్​పీ పెట్రోల్​ పంపులో దారుణం జరిగింది. డీజిల్​ పోయడానికి ఓ ట్యాంకర్ బంక్​కు వచ్చింది. డీజిల్​​ పోసిన తర్వాత డ్రైవర్​ బండిని ముందుకు నడిపించాడు. అయితే ట్యాంకర్​ ముందు ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడు. అది చూడకుండా డ్రైవర్​.. ట్యాంకర్​ను అతని పైనుంచి పోనిచ్చాడు. అక్కడ ఉన్న కొంతమంది పడుకున్న వ్యక్తిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలు పెట్రోల్​ బంక్​లోని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

తీవ్రగాయాలైన వాటర్​ మాన్​ పెంటయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లగా మరణించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ డ్రైవర్​ సిద్ధార్థ్​ కన్​స్ట్రక్షన్​కు చెందినవాడిగా స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని ఆరోపించారు. ఇంతా జరిగిన అధికారులు చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'బర్త్ డే బంప్స్ పేరిట వెర్రి వేషాలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details