తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అభ్యర్థులు కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి: బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా 21 విపక్ష పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్‌ అరోడాను కలిశారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేందుకు ఈసీకి ఉన్న ఇబ్బందులేంటనే విషయంపై చర్చించారు.

కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి: బాబు

By

Published : May 7, 2019, 7:12 PM IST

కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి: బాబు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడాతో సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా.. జాతీయ నాయకులు మీడియాతో మాట్లాడారు. నేతలు ఎవరేమన్నారో వారి మాటల్లోనే...

ఈవీఎంలపై పదేళ్లుగా పోరాటం చేస్తున్నాం. 5 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కించాక తేడా వస్తే ఏం చేస్తారు..? అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలి. ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోవాలి. అభ్యర్థులు కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి. పారదర్శకత ఉంటే వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటి..? - చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి

మేం లేవనెత్తిన అంశాలను ఈసీ పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఈసీ బాధ్యత. ఓటు వేసిన ప్రజలు సంతృప్తి చెందాలనేదే మా కోరిక.- డి.రాజా , సీపీఐ నాయకుడు

50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరాం. 5 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో తేడా వస్తే మొత్తం స్లిప్పులు లెక్కించాలని కోరాం. ఈవీఎంల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఓట్ల లెక్కింపు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. -అభిషేక్‌ మను సింఘ్వీ, కాంగ్రెస్ నాయకుడు

ABOUT THE AUTHOR

...view details