తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఇస్రో సారథి శివన్​కు అబ్దుల్​ కలాం పురస్కారం - అబ్దుల్​ కలాం పురస్కారం

ఇస్రో ఛైర్మన్​ డాక్టర్​ కైలాసవాడివో శివన్​కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్​ కలాం అవార్డును అందజేయనుంది. శాస్త్ర- సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానం పై అవగాహన కల్పించడంలో ఆయన చూపిన చొరవకు ఈ అవార్డును బహుకరించనుంది.

ఇస్రో అధిపతి శివన్​కి అబ్దుల్​ కలాం పురస్కారం

By

Published : Aug 16, 2019, 9:47 AM IST

Updated : Sep 27, 2019, 4:03 AM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఛైర్మన్, రాకెట్​ మ్యాన్​గా పేరొందిన డాక్టర్​ శివన్​కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్​ కలాం పురస్కారం ప్రకటించింది. శాస్త్ర- సాంకేతిక రంగాల్లో పురోగతికి కృషి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో ఆయన చూపిన చొరవను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. పురస్కారం కింద ఎనిమిది గ్రాముల బంగారు కానుక, రూ. 5 లక్షల నగదు అందజేయనున్నారు.

శివన్​ సారథ్యంలో ఇస్రో గత నెలలో చంద్రయాన్​-2ను రోదసిలోకి విజయవంతంగా పంపింది. ఆయన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందినవారు. 1983లో ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. జీఎస్​ఎల్​వీ క్రయో దశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు.

ఇస్రోలో ఉపగ్రహాన్ని, రాకెట్​ను ప్రయోగించడానికి ముందు అది పనిచేసే తీరును పరీక్షించి, పర్యవేక్షించడానికి ఉపయోగపడే సాఫ్ట్​వేర్​కు శివన్​ రూపకల్పన చేశారు. అంగారకుడిపైకి పంపిన 'మామ్'​ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. ఆయన సారథ్యంలో మూడేళ్లలో తిరుగులేని క్రయోజనిక్​ ఇంజిన్​ను తయారుచేశారు.

Last Updated : Sep 27, 2019, 4:03 AM IST

ABOUT THE AUTHOR

...view details