బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్... టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. జపాన్లోని క్యోటో విమానాశ్రయం ఇందుకు వేదికైంది. ఆయన్ను కలవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ట్విట్టర్ వేదికగా ఫొటోను పంచుకున్నాడు ఆమిర్.
నాకు స్ఫూర్తినిచ్చిన వారిలో మీరొకరు: ఆమిర్ - చిరంజీవి
టోక్యో విమానాశ్రయంలో మెగాస్టార్ చిరంజీవిని ఆమిర్ ఖాన్ కలిశాడు. తనకెంతో స్ఫూర్తినిచ్చిన వారిలో చిరంజీవి ఒకరంటూ ఆయనతో దిగిన ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
నాకు స్ఫూర్తినిచ్చిన వారిలో మీరొకరు: ఆమిర్ ఖాన్
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా వస్తున్న సినిమా 'సైరా'లో ప్రస్తుతం చిరంజీవి హీరోగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయమై వీరిద్దరూ చర్చించారు. తనకు స్ఫూర్తినిచ్చిన వారిలో చిరంజీవి ఒకరని ఆమిర్ ఖాన్ అన్నాడు.
ఇవీ చదవండి: