తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆహారాన్ని మూడేళ్లపాటు తాజాగా ఉంచే పరికరం..!

ముంబయి వర్సిటీ రసాయనశాస్త్ర అధ్యాపకులు ఆహార పదార్థాలను మూడేళ్లపాటు తాజాగా ఉంచే పరికరాన్ని కనుగొన్నారు.

By

Published : Feb 8, 2019, 3:01 PM IST

వైశాలి బాంబోలే

ముంబయి విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర ఆచార్యులు డాక్టర్​ వైశాలి బాంబోలే అద్భుత ఆవిష్కరణ చేశారు. ఆహార పదార్థాలను ఎక్కువకాలం నిల్వ చేసుకునేందుకు ప్రత్యేక పరికరాన్ని కనుగొన్నారు. ఇడ్లీ, ఉప్మాను ఈ పరికర సాయంతో మూడేళ్లపాటు నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. మూడు సంవత్సరాలు నిల్వచేసినప్పటికీ ఆహారం పాడవదు, పోషకపదార్థాలు తగ్గవనీ పరిశోధకులు చెబుతున్నారు.

వైశాలి బాంబోలే

" నా పేరు ప్రొఫెసర్​ వైశాలి బాంబోలే, ముంబై వర్సిటీలో గత 10 ఏళ్లుగా పని చేస్తున్నాను. 15 ఏళ్లుగా ఆహార నిల్వలపై పరిశోధన చేస్తున్నా. 2013 నుంటి 2019 వరకు ఆరేళ్లుగా వివిధ ఆహార పదార్థాలపై ప్రయోగాలు చేశా. ఇడ్లీని నిల్వ చేయటంలో విజయం సాధించాం. ఎలక్ట్రాన్​ బీమ్​ రేడియేషన్ సాంకేతికత సాయంతో ఆహారాన్ని ఎక్కువకాలం నిల్వ చేసే సరికొత్త పద్ధతిని కనుగొన్నాం. ఇడ్లీ, ఉప్మా, ఢోక్లాపై ప్రయోగం చేసినప్పుడు తొలిసారి ఏ రసాయనాలు వినియోగించకుండా ఆహారాన్ని మూడేళ్లపాటు నిల్వచేయగలిగాం."
-డాక్టర్​ వైశాలి బాంబోలే, ముంబయి వర్సిటీ ప్రొఫెసర్

వ్యోమగాములు, సైనికులకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు కూడా ఈ పరికరం అనువుగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. తక్కువ నూనె, ప్రొటీన్లు ఉన్న ఆహారపదార్థాలపైనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు ప్రకటించారు . దాదాపు మూడున్నరేళ్ల పాటు నిల్వవుంచిన ఇడ్లీని నిన్న పరీక్షించినా అది ఇప్పటికీ తాజాగానే ఉందని పరిశోధకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details