తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ప్రభుత్వాధికారిపై చెప్పుతో దాడిచేసిన మహిళా రైతు - OFFICE

అధికారులు తమ సమస్యల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలు విసుగెత్తిపోతున్నారు. కాళ్లరిగేలా వాళ్ల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కరించటంలేదని వాపోతున్నారు. తీవ్రంగా విసుగు చెందిన ఓ బాధితురాలు ప్రభుత్వాధికారి మీద తన ఆగ్రహాన్ని చూపించింది.

A WOMEN FORMER SLAPS A GOVERNMENT OFFICER(VRO) WITH HER SLIPPER IN OFFICE

By

Published : Jun 25, 2019, 9:03 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళారైతు ప్రభుత్వాధికారిపై చెప్పుతో దాడి చేసింది. కిష్టాపూర్​కు చెందిన రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని సార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్యలు పట్టించుకోవట్లేదనే ఆగ్రహంతో అధికారులను నిలదీశారు. కిష్టాపూర్​ వీఆర్వో దానయ్యకు ఓ మహిళా రైతు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విసిగిస్తున్నాడు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న మహిళారైతు... కార్యాలయంలో అందరు చూస్తూండగానే దానయ్యపై చెప్పుతో దాడికి దిగింది. అతి కష్టం మీద దానయ్య తప్పించుకుని కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు. ఈ తతంగాన్ని మొత్తం మిగతా అధికారులు చూస్తూ ఉండిపోయారు.

కట్టలు తెంచుకున్న ఆగ్రహం...

ABOUT THE AUTHOR

...view details