తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కేసీఆర్​పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్ - Offensive post against cm kcr on facebook

సీఎం కేసీఆర్​పై ఫేస్ బుక్​లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. “స్పిరిట్ ఆఫ్ తెలంగాణ” అనే ఫేస్‌బుక్ ఖాతాలో ఉద్దేశపూర్వకంగా పెట్టిన పోస్టుల ఆధారంగా... యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
సీఎం కేసీఆర్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

By

Published : Jun 12, 2020, 11:01 PM IST

ఫేస్‌బుక్‌లో సీఎం కేసీఆర్​తో పాటు ఇతర తెరాస నాయకులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైం కానిస్టేబుల్ రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉప్పల్​కు చెందిన బాల్ చందర్ అనే యువకుడు “స్పిరిట్ ఆఫ్ తెలంగాణ” అనే ఫేస్‌బుక్ ఖాతాలో ఉద్దేశపూర్వకంగా పరువును అప్రదిష్టపాలు చేయడానికి పోస్టు చేసినట్లు తెలుసుకుని సాంకేతిక ఆధారాలతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details