2019-20 సంవత్సరానికి గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు నాబార్డ్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్య, విద్యాశాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్ఐడీఎఫ్ ద్వారా అత్యధిక నిధులు మిషన్ భగీరథకు ఇవ్వనున్నట్లు తెలిపారు. భగీరథ మిగిలిన పనులకు 85 శాతం రూ. 990 కోట్లు నాబార్డ్ ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 175 కోట్లు అందజేయనుంది. వాటితో పాటు రాష్ట్రంలోని గిడ్డంగులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గిడ్డంగుల శాఖ, గ్రామీణ ప్రాంత వైద్యాలయాల మరమ్మతులకు నిధులివ్వాని వైద్య శాఖ విజ్ఞప్తి చేసింది.
మిషన్ భగీరథకు నాబార్డ్ నుంచి రూ.990 కోట్లు - 990cros
రాష్ట్రంలో మిషన్ భగీరథకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 990 కోట్లు రుణం ఇవ్వాలని నాబార్డ్ నిర్ణయించింది. ఆర్ఐడీఎఫ్ ద్వారా అత్యధిక నిధులు మిషన్ భగీరథకు ఇవ్వనున్నట్లు నాబార్డ్ అధికారులు తెలిపారు.

మిషన్ భగీరథకు నాబార్డ్ నుంచి రూ.990 కోట్లు
మిషన్ భగీరథకు నాబార్డ్ నుంచి రూ.990 కోట్లు
ఇదీ చూడండి: 'ఫోటోలతో బెదిరించి యువతిని లోబర్చుకున్నాడు'
Last Updated : Jul 2, 2019, 8:21 AM IST