టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా వెలువడిన ఫలితాల్లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో శాసనసభ సభ్యత్వానికి ఉత్తమ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఈరోజు ఉత్తమ్ ప్రకటన చేస్తారని సమాచారం. డిసెంబర్లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో ఆయన హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉత్తమ్ వరుసగా ఆరోసారి ఎన్నికల్లో గెలిచి ఓటమి ఎరుగని నేతగా నిలిచారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్? - ఎమ్మెల్యే పదవికి రాజీనామా
హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి తాజాగా వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. రెండు పదవుల్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై ఆయన ఈ రోజు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా