జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్ సంభవించింది. అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. జిల్లాలోని పజల్పొర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు అధికారులు. వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సమాధానంగా బలగాలు దీటు సమాధానమిచ్చాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ముష్కరుల హతం
కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పజల్పొర ప్రాంతంలో అఘాంతుకులు నక్కి ఉన్నారన్న నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వారిపైకి కాల్పులు జరిపారు ముష్కరులు. ఉగ్రవాదుల చర్యలను భారత సైన్యం తిప్పికొట్టింది.
కశ్మీర్లో ఎదురుకాల్పులు
హతమయిన ముష్కరులు స్థానికులేనని సమాచారం. వారిని గుర్తించి.. సంబంధిత కుటుంబాలకు అందజేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'సరిహద్దు సవాళ్ల పరిష్కారంలో సైన్యం భేష్'
Last Updated : Oct 23, 2019, 7:01 PM IST