తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది : సైన్యం

పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి ముదాసిర్​ అహ్మద్​ను హతమార్చినట్టు సైన్యాధికారులు ప్రకటించారు. జైషే మహ్మద్​ సహా ఉగ్రసంస్థలను అంతం చేసేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

By

Published : Mar 12, 2019, 6:22 AM IST

Updated : Mar 12, 2019, 9:35 AM IST

మాట్లాడుతున్న ధిల్లాన్​

పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేశామని ఆర్మీ అధికారులు తెలిపారు. జైషే ఉగ్రసంస్థ నాయకత్వాన్ని అంతం చేయడంలో సఫలమయ్యామని తెలిపారు.

దేశంలో నక్కిన 18 మంది ఉగ్రవాదులను 21 రోజుల్లో భద్రతా దళాలు తుదముట్టించాయని లెఫ్టినెంట్​ జనరల్​ ధిల్లాన్​ తెలిపారు. హతమైన వారిలో 14 మంది జైషే ఉగ్రవాద సంస్థకు చెందినవారున్నారనని చెప్పారు. అందులో ఆరుగురు కమాండర్లు ఉన్నట్టు వెల్లడించారు.

ముదాసిర్​ హతం

పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ కీలక కమాండర్​ ముదాసిర్​ ఖాన్​ను హతమార్చినట్టు వెల్లడించారు. ఏడాది కాలంగా అతడు ఉగ్రసంస్థలో ప్రధానవ్యక్తిగా ఉన్నాడన్నారన్నారు.

ఉగ్రవాదం అంతం వరకు..

ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసే వరకు ముష్కర మూకలపై దాడులు చేస్తామని లెఫ్టినెంట్​ జనరల్​ ధిల్లాన్​ తెలిపారు. జైషేతో పాటు లష్కరే తోయిబా, హిజ్బుల్​ ముజాహిద్దీన్​ ఉగ్రసంస్థలకు చెందిన వారినీ మట్టుబెడతామని చెప్పారు. జైషేను సమూలంగా నాశనం చేస్తామన్నారు. ఆత్మాహుతి దాడులు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

పుల్వామా ఉగ్రదాడిపై విచారణ లోతుగా జరుగుతోందని చెప్పారు. దాడికి పేలుడు పదార్థాలను ముదాసిర్​కు ఎవరు అందించారనే విషయంపై ఆరా తీస్తున్నామన్నారు. ఎన్​ఐఏతో సమన్వయం చేసుకొని విచారణను వేగవంతం చేస్తున్నామన్నారు.

Last Updated : Mar 12, 2019, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details