DSP Transfers in AP: ఏపీలో డీఎస్పీల బదిలీలు.. 50మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు - DSP transfers in Andhra Pradesh
![DSP Transfers in AP: ఏపీలో డీఎస్పీల బదిలీలు.. 50మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు DSP Transfers in AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18435945-323-18435945-1683359609967.jpg)
13:15 May 06
డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ
DSP Transfers in AP: రాష్ట్రంలో DSPల బదిలీలపై ఇంకా సందిగ్ధత వీడలేదు. తాజాగా 50 మంది డీఎస్పీలను బదిలీలు, పోస్టింగులు చేస్తూ డీజీపీ K.V.రవీంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అమలాపురం ఎస్డీపీవో(SDPO)గా అంబికా ప్రసాద్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం... ఏసీబీ DSPగా.. T.S.R.K. ప్రసాద్‌ను రామచంద్రాపురం S.D.P.O.గా బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా DSP కిషోర్ కుమార్‌ను రాజమహేంద్రవారం తూర్పు DSPగా, విజయవాడ పశ్చిమ ACPగా హనుమంతరావును ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జమ్మలమడుగు S.D.P.O. ఉమామహేశ్వరరెడ్డిని గుంటూరు D.S.P.గా, ఒంగోలు D.S.P.గా నారాయణస్వామి రెడ్డి, దర్శి DSPగా అశోక్ వర్ధన్, కనిగిరి DSPగా రామరాజు నియమించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కోరుకున్న హరినాథ్‌రెడ్డిని అనంతపురం పీటీసీకి బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న 24మంది DSPలను వేర్వేరు చోట్ల పోస్టింగ్ ఇస్తూ DGP ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చదవండి: