తెలంగాణ

telangana

ETV Bharat / breaking-news

viveka murder case : ఇవేం ఉత్తర్వులు..! గంగిరెడ్డికి బెయిల్ రద్దుపై సీజేఐ ఆశ్చర్యం.. - cbi

వివేకా హత్య కేసు
వివేకా హత్య కేసు

By

Published : May 18, 2023, 1:33 PM IST

Updated : May 18, 2023, 3:05 PM IST

13:22 May 18

బెయిల్‌ రద్దుచేసి మళ్లీ ఫలానా రోజు విడుదల చేయాలన్న ఉత్తర్వులపై ఆశ్చర్యం

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు ఎర్ర‌ గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి చంద్ర‌చూడ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్‌ రద్దు చేస్తూనే తిరిగి ఫలానా రోజు విడుదల చేయాలి అని పేర్కొనడంపై... అసలు ఇవేం ఉత్తర్వులని సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.

సాక్షులను ప్రభావితం చేస్తున్నారని... వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డికి పులివెందుల కోర్టు 2019 జూన్ 27న డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల సిట్ ఏర్పాటైన నేపథ్యంలో కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. దీంతో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పేర్కొనడంతో సీబీఐ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. మే 5వ తేదీలోగా హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. లేని పక్షంలో అదుపులోకి తీసుకోవాలని తెలంగాణ హైకోర్ట్‌ సీబీఐని ఆదేశించింది.

జులై 1న విడుదల చేయాలని... ఏప్రిల్ 27న గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ ర‌ద్దు చేసిన హైకోర్టు.. తిరిగి జులై 1న విడుద‌ల చేయాల‌ని ఆదేశాలు ఇచ్చింది. బెయిల్‌ రద్దు ఉత్తర్వుల షరతును వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంలో సవాల్‌ చేశారు. సునీత పిటిషన్‌పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెయిల్ రద్దు చేస్తూ జులై 1న విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. వివేకా కేసు దర్యాప్తు జూన్ 30న ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జులై 1న బెయిల్‌పై విడుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం... సునీత పిటిష‌న్‌ను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేసింది. వచ్చే వారం వెకేష‌న్ బెంచ్‌ విచారణ జరపనుంది.

ఇవీ చదవండి :

Last Updated : May 18, 2023, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details