Delhi AP Bhawan: దిల్లీ ఏపీభవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు - Telangana Govt
20:49 May 04
భేటీ వివరాలను రెండు రాష్ట్రాల అధికారులకు పంపిన హోంశాఖ
Delhi AP Bhawan: దిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏప్రిల్ 26న ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ భేటీ అయింది. భేటీ వివరాలను రెండు రాష్ట్రాల అధికారులకు పంపింది. భూములు, భవనాల విభజనపై గతంలో ఏపీ 3 ప్రతిపాదనలు చేసింది. ఆస్తుల విభజనపై తాజాగా తెలంగాణ మరో ప్రతిపాదన పెట్టింది. గోదావరి, శబరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఇవ్వాలని ప్రతిపాదించింది.
కేంద్ర హోంశాఖ.. తెలంగాణ ప్రతిపాదనకు పూర్తిగా భిన్నమైన ప్రతిపాదన చేసింది. 7.64 ఎకరాల పటౌడీ హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని, మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ భూమి ఏపీ తీసుకోవాలని పేర్కొంది. ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్రం సూచించింది. ఏపీకి అదనపు భూమి దక్కితే తెలంగాణ.. ఏపీ నుంచి భర్తీ చేసుకోవాలని తెలిపింది.
ఇవీ చదవండి: