Amaravati: సుప్రీంకోర్టులో మే 9న రాజధాని అమరావతి కేసు విచారణ - జోసెఫ్ నేతృత్వం అమరావతి కేసు
19:51 May 04
విచారణ జులై 11 తేదీ నుంచి మే 9కి మార్పు
Amaravati: రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. ఈ పిటిషన్ల విచారణను గత విచారణ సమయంలో సుప్రీంకోర్టు జులై 11కు వాయిదా వేసింది. రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలుచేసిన వారిలో పలువురు మృతిచెందారని, వారి తరఫున చట్టబద్ధ వారసులను రాష్ట్రప్రభుత్వం గుర్తించలేదని గత విచారణ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ నాడు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయం తమకు తెలియదని, ప్రతివాదుల చట్టబద్ధ వారసులను గుర్తిస్తూ పిటిషన్ దాఖలు చేస్తామని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి చెప్పారు. చట్టబద్ధ వారసులను గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తాజాగా వ్యాజ్యకాలీన దరఖాస్తు (ఐఏ) దాఖలు చేసింది. 9న సుప్రీంకోర్టు ఐఏపైనే విచారణ చేపడుతుందని న్యాయవాద వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: