AP SSC Exams 2023 Results Released: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయం 11గంటలకు విజయవాడలో పదో తరగతి పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు తమ హవా కొనసాగించారు. పదో తరగతి ఫలితాల్లో బాలురు ఉత్తీర్ణత 69.27 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 75.38 శాతంగా నమోదైంది. 933 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నెలకొనగా.. 38 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు వచ్చాయి. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 87.47 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం సాధించగా.. 60.39 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 2 నుంచి 10 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. రిజల్ట్ కోసం.. ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
AP SSC Results: పది ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి - ఏపీలో పది ఫలితాలు విడుదల
![AP SSC Results: పది ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి AP SSC Result](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18434791-28-18434791-1683349319399.jpg)
AP SSC Result
10:24 May 06
పదో తరగతి ఫలితాల్లో 72.26 శాతం ఉత్తీర్ణత
కేవలం 18రోజుల్లోనే ఫలితాలు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. కేవలం 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6లక్షల 05వేల 052 మంది పరీక్షలకు హాజరు కాగా.. అందులో బాలురు 3లక్షల 09వేల 245, బాలికలు 2లక్షల 95వేల 807 మంది హాజరైన వారిలో ఉన్నారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..
- bse.ap.gov.inలో BSEAP అధికారిక సైట్‌ని ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP 10వ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రూల్ నమోదు చేసి, ఎంటర్ క్లిక్ చేయండి.
- పూర్తయిన తర్వాత మీ ఫలితం స్క్రీన్‌పై వస్తుంది.
- ఆ తర్వాత ఆ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి..
ఇవీ చదవండి:
Last Updated : May 6, 2023, 2:36 PM IST