తెలంగాణ

telangana

ETV Bharat / breaking-news

రైల్వేట్రాక్‌పై ఇన్‌స్టా రీల్స్‌ చేస్తూ యువకుడు మృతి - sarpraj died

young man died while making insta reels
young man died while making insta reels

By

Published : May 5, 2023, 7:28 PM IST

Updated : May 5, 2023, 8:15 PM IST

19:23 May 05

మృతుడు సర్ఫరాజ్​గా గుర్తింపు

Young man died while making Insta Reels: రీల్స్​ సరదా.. ఆ యువకుడి ప్రాణాలు తీసింది. ఇన్​స్టా రీల్స్ చేద్దామని రైల్వే ట్రాక్​ దగ్గరికి వెళ్లాడు. రీల్స్ చేస్తూ వెనక వస్తున్న రైలును గమనించలేదు. దీంతో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్ నగర్‌కు చెందిన మదర్సా విద్యార్థి మహ్మద్ సర్ఫరాజ్(16) సనత్​ నగర్​లోని రైల్వే లైన్ సమీపంలో ఇన్‌స్టా రీల్స్ రికార్డ్ చేయడానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్‌పై వీడియో తీస్తుండగా.. వెనక నుంచి వచ్చిన రైలు సర్ఫరాజ్​ను ఢీ కొట్టింది. దీంతో సర్ఫరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్పాట్​లో మృతుడి ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : May 5, 2023, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details