తెలంగాణ

telangana

ETV Bharat / breaking-news

Boy died in drainage : బాలుడిని మింగిన ఓపెన్ డ్రైనేజీ.. విజయవాడలో విషాదం - boy missing in vijayawada

ఓపెన్ డ్రేనేజీలో పడి బాలుడు మృతి
ఓపెన్ డ్రేనేజీలో పడి బాలుడు మృతి

By

Published : May 5, 2023, 2:10 PM IST

Updated : May 5, 2023, 5:18 PM IST

14:06 May 05

మృతదేహాన్ని గుర్తించిన వీఎంసీ సిబ్బంది

Boy died in drainage : విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. గురునానక్ కాలనీలోని ఓపెన్​ డ్రైనేజీలో పడి బాలుడు మృతి చెందాడు. స్థానికంగా నివాసం ఉంటున్న అభి అనే ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి మురికి కాలువలో గల్లంతయ్యాడు. ఆచూకీ లభించక పోవడంతో అభి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గురునానక్ కాలనీ వద్ద డ్రైనేజీ పొంగి ప్రవహిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, అగ్ని మాపక సిబ్బంది బాలుడి ఆచూకీ కోసం గాలించగా... కిలోమీటర్‌ దూరంలో భారతీనగర్‌ వద్ద బాలుడి మృతదేహాన్ని వీఎంసీ సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. కాగా, ఓపెన్‌ డ్రెయిన్‌పై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా కావాలని బాలుడిని కాల్వలోకి తోసేశారా అనే అనుమానాలు కుటుంబసభ్యుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : May 5, 2023, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details