పెద్దలు, 12 ఏళ్ల దాటిన వారి కోసం రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ధరపై (Zycov-D Vaccine Price) జైడస్ క్యాడిలా కేంద్రానికి ఓ ప్రతిపాదన చేసింది. మూడు డోసులకు కలిపి రూ.1900 వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ధర తగ్గింపు కోసం కేంద్రం.. సంబంధిత సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
వ్యాక్సిన్ ధరకు సంబంధించి (Zycov-D Vaccine Price) ఈ వారంలో కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే అంత ధర..
జైకొవ్-డి వ్యాక్సిన్‌కు ఉపయోగించే ఇన్‌జెక్టర్ ధరే రూ.30వేలు ఉంటుందని.. అందుకే కొవాగ్జిన్, కొవిషీల్డ్ కన్నా ఎక్కువ ధరను సంస్థ ప్రతిపాదించిందని ఓ అధికారి వెల్లడించారు.
జైకొవ్-డి వ్యాక్సిన్ దేశీయ పరిజ్ఞానంతో తయారైన రెండో టీకా. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. ఈ టీకాను నేరుగా (Zycov D Vaccine Dose) చర్మంలోకి ఎక్కిస్తారు. ఇందుకోసం సూది అవసరం ఉండదు. నొప్పి లేకుండా ఫార్మాజెట్ అనే సాధనం ద్వారా దీన్ని ఎక్కిస్తారు.
వ్యాక్సిన్ కోసం జైడస్ రూపొందించిన ఈ జెట్ ఇన్‌జెక్టర్ ద్వారా 20వేల డోసులు అందించొచ్చు. ఈ టీకాను మూడు విడతల కింద 0, 28, 56 రోజులకు తీసుకోవాలి.
ఇదీ చూడండి :'పిల్లలకు త్వరలోనే కరోనా టీకా.. వారికే ప్రాధాన్యం'