కేరళలో జికా వైరస్ వ్యాప్తి స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరో 14 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15కు చేరింది. వీరిలో ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలు కావడం గమనార్హం.
జికా తొలి కేసు తిరువనంతపురంలోని పరస్సాలలో నమోదైంది. ఓ 24 ఏళ్ల గర్భిణికి వైద్యులు గురువారం పరీక్షలు నిర్వహించగా ఆమెకు ఈ వైరస్ సోకినట్లు వెల్లడైంది. ఈ నెల 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డలో వైరస్ లక్షణాలు లేనందున వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.