Z category security To Punjab MLA: ఇటీవల భాజపాలో చేరిన పంజాబ్ ఎమ్మెల్యే రాణా గుర్మిత్ సింగ్ సోఢీకి కేంద్ర ప్రభుత్వం జెడ్(Z) కేటగిరి వీఐపీ భద్రత కల్పించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. సోఢీ గత నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కు సన్నిహితుడిగా మెలిగారు. అమరీందర్ ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవలే కాంగ్రెస్కు రాజీనామా చేసి.. డిసెంబర్ 21న భాజపా తీర్థం పుచ్చుకున్నారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు సోఢీకి జెడ్ కేటగిరి భద్రత కల్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా పంజాబ్, దిల్లీలో ఆయన పర్యటించిన ప్రతిసారి సీఆర్పీఎఫ్ కమాండోలు రక్షణ కల్పించనున్నట్లు వెల్లడించాయి. సోఢీతో పాటు ఆరు నుంచి ఎనిమిది మంది కమాండోల బృందం నిరంతరం ఆయన వెంటే ఉండనుందని సమాచారం.