YSRCP Candidates Fourth List :ఏపీలో51 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లను మార్చుతూ వైఎస్సార్సీపీ విడుదల చేసిన జాబితాలతో ఆ పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మూడు జాబితాల్లో కలిపి ఇప్పటి వరకు 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించిన సీఎం జగన్ ముగ్గురు ఎంపీలను పక్కన పెట్టేశారు. దీంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. తమను తీవ్ర అన్యాయంచేశారని, నమ్మించి మోసం చేశారంటూ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రగిలి పోతున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు. ఇతర పార్టీల్లోకి టచ్‌లోకి వెళ్తున్నారు. వీరిని నిలువరించి,పార్టీని రక్షించుకోవడం, వైకాపా పెద్దలకు తలనొప్పిగా మారింది.
YSRCP 4th List :ఇదిలా ఉండగా నాలుగో జాబితా సిద్ధం చేస్తున్నారన్న ప్రచారంతో పలు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మార్పులు చేస్తున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమ సీటు ఉంటుందా? ఊడుతుందా? అని తెలుసుకునేందుకు పార్టీ పెద్దలను, ఐప్యాక్ టీంలను ఆశ్రయిస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు పనులు కోసమని చెబుతూ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు. సీట్లు కోల్పోయిన వారు సైతం తమకు న్యాయం చేయలని క్యాంపు కార్యాలయానికి వచ్చి నేతలను, సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వైఎస్సార్సీపీలో ప్రకంపనలు - అధిష్ఠానం నిర్ణయంపై నిరసన జ్వాలలు
న్యాయం చేయండీ సారూ : గురువారం ప్రకటించిన జాబితాలో ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను తప్పించారు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే సీటు ఇస్తామని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. దీంతో తన పరిస్ధితి ఏమిటని మద్ది శెట్టి వేణుగోపాల్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసిన ఆయన తన సీటు విషయమై చర్చించారు. దర్శినుంచి తప్పిస్తున్నానని, మరో సీటు చూస్తానన్న సీఎంఎక్కడ అనే విషయం స్పష్టం చేయలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
రాజకీయ భవిష్యత్ కార్యాచరణ :పార్టీ ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం పొలిటికల్ కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలసి తన ఆవేదన తెలిపారు. సీఎం చెప్పినట్లు తనకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. ఒంగోలు ఎంపీ లేదా ఏదేనా అసెంబ్లీ స్థానానికి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు. సీటు ఉంటుందా లేదా అనే విషయమై స్పష్టమైన హామీ రాకపోవడంతో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే విషయమై మద్ది శెట్టి వేణుగోపాల్ ఆందోళన చెందుతున్నారు.
వైఎస్సార్సీపీలో ముగిసిన మార్పులు చేర్పుల పర్వం- సిట్టింగులకు జగన్ మొండిచేయి