YS Sharmila Arrest in Hyderabad : టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నినాదాలు చేశారు.
Look Out Notices to YS Sharmila : ప్రశ్నాపత్రాల లీకేజీలో చిన్న వాళ్లను దోషులుగా చిత్రీకరిస్తూ.. పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ ఆందోళన అంటే హౌస్ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. నేటి ఆందోళన నేపథ్యంలో తన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులు మోహరించారన్న షర్మిల.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి కార్యక్రమం కోసం నిన్న రాత్రే ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. హోటల్ రూమ్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి వద్ద కనిపించకపోవడంతో పోలీసులు తనకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారన్న ఆమె.. ఆ నోటీసులు ఇవ్వడానికి తానేమైనా క్రిమినల్‌నా అంటూ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు.
''పేపర్ లీకేజీలో చిన్న వాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారు. పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఆందోళన అంటే హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఆందోళన కోసం నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చా. హోటల్ రూమ్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు. నాకు లుక్ అవుట్ ఆర్డర్ నోటీస్ ఇచ్చారు. లుక్ అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి నేను క్రిమినల్‌నా?''- వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు