YS Viveka Murder Case :మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ A5 శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది అనిల్ తల్వార్ వాదనలు వినిపిస్తూ ఎక్కువ పేజీలున్నాయని మొదటి అభియోగ పత్రంలో నిందితుడిగా చేర్చలేదన్న సాంకేతిక కారణాలతో బెయిలు కోరడం సరికాదన్నారు. వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. కుట్రతో పాటు ఘటనా స్థలంలో సాక్ష్యాలను చెరిపివేతలో ఆయన పాత్ర ఉందన్నారు.
Vivekananda Reddy Murder Case in Telangana High Court :శివశంకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలున్నప్పుడు సీబీఐ దాఖలు చేసిన మొదటి అభియోగ పత్రంలో నిందితుడిగా ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నకు బదులిస్తూ హత్యకు సంబంధించిన కీలక అంశాలు రాబట్టాలనే వ్యూహంలో భాగంగానే చేర్చలేదని సీబీఐతరఫు న్యాయవాది తెలిపారు. దర్యాప్తు మొదటి నుంచి శివశంకర్‌రెడ్డి అందరినీ బెదిరిస్తున్నారని వివరించారు. గంగాధర్‌రెడ్డి మొదట CRPC.161 కింద వాంగ్మూలం ఇచ్చారని, తరువాత మేజిస్ట్రేట్ ముందు ఇవ్వడానికి నిరాకరించారన్నారు. అనంతరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని గుర్తు చేశారు.
వివేకాను చంపి ఆయన కుమార్తె సునీతను వేధిస్తున్న జగన్, మనిషేనా: చంద్రబాబు
A5 Shivashankar Reddy Bail Hearing :శంకరయ్య, గంగాధర్‌రెడ్డి, ఇనయతుల్లా, వెంకటరమణ, జగదీశ్వర్‌రెడ్డి, తదితరులను బెదిరించినట్లు వాంగ్మూలాలు ఉన్నాయన్నారు. అవినాష్ రెడ్డి అనుచరుడైన శివశంకర్‌రెడ్డికి MLC టికెట్ ఇప్పించాలన్న ప్రయత్నాలు విఫలం కావడంతో వివేకా హత్యకు అందరూ కలిసి కుట్ర పన్నారని వివరించారు. శివశంకర్‌రెడ్డికి సన్నిహితుడైన గంగిరెడ్డి ద్వారా కుట్రను అమలు చేయించారని దాని కోసం 40 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిందన్నారు.
మొదట శివశంకర్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చారని ఇందులో సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి 75 లక్షలు అందజేశారని తెలిపారు. కీలకమైన సాక్షులు 30 మందిని గుర్తించామనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఎప్పటిలోగా వారి వాంగ్మూలాలు నమోదు చేస్తారని ప్రశ్నించారు. గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని దర్యాప్తు పూర్తయిందన్న కారణంగా బెయిలు మంజూరు చేయరాదన్నారు.