YS Viveka Daughter Sunitha : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని తేల్చిచెప్పారు. నేటికి వివేకా హత్య జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తైంది. వివేకా వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం సునీత మీడియా సమావేశం నిర్వహించారు.
"కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నాను. నాకు ఆ విషయం తెలుసు. ఈ కేసుపై విచారణ జరుగుతుంది. ఈ సమయంలో నేను దేని గురించి మాట్లాడాకూడదు. నాకు ఏమైనా సమాచారం తెలిస్తే.. దానిని దర్యాప్తు సంస్థకే తెలియజేస్తాను. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకూడదు. ఎంతటివారైనా బయటికి రావాల్సిందే"-నర్రెడ్డి సునీత, వివేకా కూతురు
కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ)కి డాక్యుమెంట్లలో రూపంలో సమర్పించినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని తనకు కూడా తెలుసని స్పష్టం చేశారు. హత్య కేసులో ప్రయేయం ఉందని నమ్ముతున్న కాబట్టే వారి గురించి సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వివేకా హత్యపై గతంలో కొందరు వ్యక్తలు తేలిగ్గా మాట్లాడారని గుర్తు చేశారు.
"నాన్న చనిపోయిన మొదట్లో ఎవరో కొద్దిమంది అన్నారు. కడప, కర్నూలులో ఇలాంటివి మామూలే కదా.. ఎందుకు అలా ఉన్నారని. కడప అంటే అరాచకాలు గుర్తుకువస్తాయి. నాన్న హత్యతో 30 సంవత్సరాల క్రితం జరిగిన గొడవలు మళ్లీ మొదలవుతున్నాయమో అనిపిస్తోంది. కడప ఎటువంటి గొడవలు జరగకుండా, కేవలం అభివృద్ది మాత్రమే జరగాలి. నాన్నని హత్య చేసిన వారు ఎవరైనా సరే బయటికి రావాల్సిందే"-నర్రెడ్డి సునీత, వివేకా కూతురు
కడప, కర్నూలు(రాయలసీమ) వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అని అన్నట్లు తెలిపారు. 30 ఏళ్ల కిందట పులివెందుల ప్రాంతంలో గొడవలు ఇప్పుడు మళ్లీ మొదలవుతున్నాయని అనిపిస్తుందని సునీత అన్నారు. వివేకాను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెట్టగలను అని ఆమె వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు నిందితులు ఎవరో తెలిసేదాకా న్యాయపోరాటం ఆపనని స్పష్టం చేశారు. వివేకా కేసు విషయంలో ఎంతో మంది తెలియకుండానే సహరిస్తున్నారని.. వారందరికీ తన కృతజ్ఞలు తెలిపారు.
నాన్నను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతాను ట్రెండ్ అవుతున్నజస్టిస్ ఫర్ వివేకా యాష్ ట్యాగ్: ట్విట్టర్‌లో జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి గురై నేటితో నాలుగేళ్లు పూర్తవుతుండగా....వారికి న్యాయం చేయాలని నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు. జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా టాగ్‌తో నెటీజన్లు వేల సంఖ్యలో సందేశాలను పెడుతున్నారు.
ట్విట్టర్ ట్రెండింగ్‌లో జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా యాష్ ట్యాగ్ ఇవీ చదవండి: