YS Sharmila on YSRTP Merger With Congress :కేసీఆర్ అవినీతి పాలను అంతమెందించేందుకు కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా చర్చించినట్లు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన ప్రతి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పార్టీ విలీనంపై చర్చలు తుది దశకొచ్చాయని వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి(YSR Death Anniversary) సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలో తండ్రి విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల... తన తండ్రిపై వారికి గౌరవముందని నిర్ధారించుకున్న తర్వాతే సోనియా, రాహుల్‌తో చర్చల వరకు వెళ్లినట్లు చెప్పారు.
బీఆర్ఎస్ దాడులకు భయపడను: వైఎస్ షర్మిల
"పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుదిదశకు వచ్చాయి. వైఎస్ఆర్ లేని లోటు ఈరోజుకు తెలుస్తోందని సోనియా, రాహుల్ ఆకాశానికెత్తారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే.. తెలిసి చేసిన తప్పు కాదు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని సోనియా, రాహుల్ నాతో అన్నారు. కేసీఆర్ అవినీతి పాలను అంతమెందిచటానికే సోనియాతో చర్చలు జరిపాను. కేసీఆర్‌ను గద్దె దించే అంశంపై సోనియా, రాహుల్‌తో సుదీర్ఘంగా చర్చించాను. మా కేడర్, లీడర్స్‌తో మాట్లాడాక విలీనంపై ప్రకటన చేస్తాను." వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు