YS Sharmila Meets Sonia Gandhi : రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని పార్టీల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జింపింగ్ చేస్తుంటే.. మరికొన్ని పార్టీల్లో కీలక నేతలు గూడు వీడుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే చేరికలపై ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి.
YS Sharmila Meets Rahul Gandhi : ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎలాగైనా రాజన్న రాజ్యం తీసుకురావాలనే నినాదంతో వచ్చినవైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీ రాష్ట్రంలో పాగా వేసేలా చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఓవైపు చేరికలు.. పార్టీ బలోపేతంపై షర్మిల స్పెషల్ ఫోకస్ పెడుతూనే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మూడోసారి గెలవకుండా.. గద్దె దించేందుకు తనతోటి కలిసి నడవాలని వామపక్ష, ప్రతిపక్ష పార్టీలను షర్మిల కోరుతున్నారు.
YSRTP Merges in Congress :ఇలా తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా వైఎస్ షర్మిల చర్చలు జరుపుతుంటే కొంతకాలంగా ఈ పార్టీకి సంబంధించి ఓ వార్త రాజకీయ వర్గాల్లో బాగా ప్రచారం చేస్తోంది. అదేంటంటే.. వైఎస్సార్టీపీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని. ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా షర్మిల.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం దిల్లీలో ఆమె వారిని కలవడంతో కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం దాదాపు ఖరారైనట్లేనని రాజకీయ వర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తోంది.