కాంగ్రెస్‌లో చేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల - కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
![కాంగ్రెస్‌లో చేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల sharmila](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-01-2024/1200-675-20425915-thumbnail-16x9--sharmila-joined-congress.jpg)
Published : Jan 4, 2024, 11:05 AM IST
|Updated : Jan 4, 2024, 12:13 PM IST
11:02 January 04
రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
YSRTP president Sharmila joined Congress :మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈమేరకు నిన్న రాత్రే షర్మిల తన భర్త అనిల్‌తో కలిసి దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరుతున్న షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల దిల్లీలో ఏపీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన, మల్లికార్జునఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్‌తో కలిసి నడిచే అవకాశం రావడం పట్ల వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నారని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కలగన్నారని గుర్తు చేశారు. నేను మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా అలాంటి పార్టీలో చేరిన తనకు తండ్రి ఆశీస్సులు ఉంటాయని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించానని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని షర్మిల చెప్పారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్‌లో ఒక భాగం అని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు.