Youtube channels blocked in India: నిఘా విభాగం అందించిన సమాచారంతో పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతోన్న యుట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను బ్లాక్ చేసినట్లు తెలిపింది సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ. జనవరి 20న ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు ఐబీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ విక్రమ్ సహాయ్.
" నిఘా విభాగం సమాచారంతో 35 యూట్యూబ్ ఛానళ్లు, 2 ట్విట్టర్, 2 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 2 వెబ్సైట్లు, ఓ ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేయాలని ఆదేశించాం. ఆయా ఖాతాలను పరిశీలిస్తే అవన్నీ పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నాయని తెలిసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయటం వంటివి చేస్తున్నారు. "
- విక్రమ్ సహాయ్, ఐబీ జాయింట్ సెక్రెటరీ.