తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విదేశాలకు పంపిస్తానని ట్రాప్.. రూ.లక్షలు వసూలు చేసి జెండా ఎత్తేసిన ట్రావెల్స్! - unemployed youth trapped by fraudsters

విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడొచ్చు అని కలలు కనే నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని లక్షలు వసూలు చేశారు కేటుగాళ్లు. విదేశాలకు పంపుతామని మాయమాటలు చెప్పి మోసం చేశారు.

fraudsters in gorakhpur
fraud

By

Published : Dec 17, 2022, 7:56 PM IST

బయటి దేశాలకు పంపుతామని చెప్పి మాటలతో మాయచేసి ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన నిరుద్యోగ యువతను బురిడీ కొట్టించారు ఒడిశాకు చెందిన మోసగాళ్లు. నిరుద్యోగ యువకుల నుంచి రూ.యాభై వేల చొప్పున వసూలు చేసి.. జెండా ఎత్తేశారు దుండగులు. ఇలా మొత్తం రూ.50 లక్షలు వసూలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే..
ఒడిశాకు చెందిన నిందితులు.. యూపీ మొహద్దీపుర్​లో ట్రావెల్ వరల్డ్ పేరుతో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. యువకులను విదేశాలకు పంపిస్తామంటూ వారి నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితులు.. హఠాత్తుగా తమ కార్యాలయాన్ని మూసేసి పరారయ్యారు. ఉత్తర్​ప్రదేశ్, కుషీనగర్ జిల్లాకు చెందిన వికాస్ వర్మ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

"మొహద్దీపుర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ట్రావెల్ వరల్డ్ అనే కంపెనీ పనిచేస్తోంది. ఇక్కడ ఒడిశాలోని హిల్లపటాన్‌కు చెందిన సుబ్రత కుమార్ పోలో, కేఆర్ రావణిలు విదేశాలకు వెళ్లడానికి ఒక్కొక్కరి నుంచి రూ.యాభై వేల చొప్పున వసూలు చేశారు. నవంబర్‌లో మూడు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. డిసెంబర్ 15న పాస్‌పోర్ట్, వీసా ఇస్తామని పిలిచారు. తీరా ఇక్కడికి వచ్చేసరికి ఆఫీసు మూసి ఉంది" అని వికాస్ వర్మ పేర్కొన్నాడు.

.

మరికొందరు బాధితులు సైతం మొహద్దీపుర్‌లోని కార్యాలయం వద్ద బైఠాయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు కేఆర్ రావణి, సుబ్రత కుమార్ పోలో కోసం గాలింపు ముమ్మరం చేశారు. వీరిద్దరూ నకిలీ పత్రాలు సైతం తయారు చేశారని పేర్కొన్నారు. విచారణలో భాగంగా.. పోలీసులు స్థానిక ట్రావెల్ వరల్డ్ కార్యాలయాన్ని తెరిచి పరిశీలించగా.. లోపల 50కి పైగా పాస్‌పోర్టులు లభ్యమయ్యాయి. నిందితులు లాకర్ నంబర్‌తో కూడిన సిమ్‌ను తీసుకున్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఒడిశా వెళ్లేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details