Youth Trapped in a Cliff: పన్నెండేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్ చిత్రం '127 అవర్స్'ను తలపించే సంఘటన ఇపుడు కేరళలోని పాలక్కాడ్ సమీప మలప్పుజ ప్రాంతంలో వెలుగు చూసింది. సినిమాలో పర్వతారోహకుడైన కథానాయకుడు బండరాయి కింద ఇరుక్కుపోయి నిర్మానుష్యంగా ఉన్న లోయలో 127 గంటలు చిక్కుకుపోతాడు. మలప్పుజ సమీప కొండ చీలికలో గత రెండు రోజులుగా చిక్కుకొని ఉన్న యువకుడు బాబు అవస్థ ఇపుడు అలాగే ఉంది. గత సోమవారం నుంచి ఇతనికి ఆహార పానీయాలు లేవు. సహాయక బృందం ఎన్ని ప్రయత్నాలు చేసినా యువకుడి దాకా చేరలేకపోతోంది. తీరప్రాంత రక్షకదళం హెలికాప్టర్ కూడా యువకుణ్ని కాపాడే చర్యల్లో నిమగ్నమై ఉంది. ఇతణ్ని కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైన్యం సాయం కోరగా.. బెంగళూరు నుంచి ఓ ప్రత్యేకదళం పంపుతున్నట్లు సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ సీఎంవోకు సమాచారం ఇచ్చారు.
కొండ చీలికలో చిక్కిన యువకుడు.. రెండు రోజులుగా అన్నపానీయాలు లేక..
Youth Trapped in a Cliff: కేరళలోని పాలక్కాడ్ సమీప మలప్పుజ ప్రాంతంలో కొండ చరియల్లో చిక్కుకుపోయిన యువకుడ్ని రక్షించేందుకు సహాయక బృందాలు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నాయి. తీరప్రాంత రక్షకదళం హెలికాప్టర్ కూడా యువకుణ్ని కాపాడే చర్యల్లో నిమగ్నమై ఉంది. ఇతణ్ని కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైన్యం సాయం కోరగా.. బెంగళూరు నుంచి ఓ ప్రత్యేకదళం పంపుతున్నట్లు సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ సీఎంఓకు సమాచారం ఇచ్చారు.
తమిళనాడులోని వెల్లింగ్టన్ నుంచి మరో బృందం పాలక్కాడ్‌కు బయలుదేరింది. సహాయకచర్యల్లో భాగంగా వాయుసేన నుంచి పారా కమాండోలు సైతం రానున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కొండ నడుమలో గూడు లాంటి చోట కూర్చొని సాయం కోసం ఎదురుచూస్తున్న బాబును కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ దళం కూడా ప్రయత్నిస్తోంది. ఇంతకూ బాబు అక్కడికి ఎలా చేరాడంటే.. గత సోమవారం మరో ఇద్దరు మిత్రులతో కలిసి కొండ శిఖరం దాకా ఎక్కే ప్రయత్నం చేశాడు. మిగతా ఇద్దరూ మధ్యలోనే విరమించుకొన్నారు. విజయవంతంగా కొండ శిఖరం చేరుకొన్న బాబు ఉన్నట్టుండి కిందికి జారి ఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.
ఇదీ చదవండి:పిచ్చుకకు సమాధి.. దశదిన కర్మ.. గ్రామస్థులందరికీ భోజనాలు!