తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై దుండగుల రాళ్ల దాడి - మనోహర్​ లాల్​ ఖట్టర్

Manohar Lal Khattar: హరియాణా సీఎం ఇంటిపై దాడి జరిగింది. ద్విచక్రవాహనాలపైన వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.

Manohar Lal Khattar
మనోహర్​లాల్​ ఖట్టర్​

By

Published : Mar 12, 2022, 10:42 AM IST

Manohar Lal Khattar: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ నివాసంపైన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలోని నిందితుల కోసం గాలిస్తున్నారు.

బైక్​లపై వచ్చి..

కర్నాల్​లోని ముఖ్యమంత్రి నివాసం వద్ద దుండగుల దాడిని మొదట అక్కడే ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాలపై సుమారు ఐదు-ఆరుగురు మంది వచ్చారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది తమను గుర్తించడం వల్ల నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.

దుండగులు రువ్విన రాళ్లు

దాడి నేపథ్యంలో సీఎం ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

ఇదీ చూడండి :కశ్మీర్​లో ఎన్​కౌంటర్స్​.. జైషే కమాండర్​ సహా నలుగురు ముష్కరులు హతం

ABOUT THE AUTHOR

...view details