పోలీసుల వాహనం ఆగి ఉందంటే భయంతో దూరంగా వెళ్తాం. దాని దగ్గరకు వెళ్తే పోలీసులు ఏమంటారోననే భయం అందరిలో ఉంటుంది. కానీ, ఓ యువకుడు ఏకంగా పోలీస్ జీపునే దొంగలించాడు. పట్టుకుని విచారించగా.. పోలీసులే ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చాడు. తాను అత్తారింటికి వెళ్లేందుకే జీపును చోరీ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ వింత సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఆదివారం జరిగింది.
ఇదీ జరిగింది:జిల్లా ఇంఛార్జ్ మంత్రి బేరీరానీ మౌర్య.. సోనాపూర్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ విధులు నిర్వర్తించేందుకు కొత్వాల్ నగర పోలీసు అధికారి సంజయ్ కుమార్ వెళ్లారు. కానీ, అక్కడ భారీగా జనం ఉండటం వల్ల జీపు పార్క్ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. దీంతో కొంత దూరంలో రోడ్డు పక్కన పార్క్ చేశాడు డ్రైవర్. ఆ దగ్గర్లోనే సేదతీరాడు. ఈ క్రమంలోనే.. ముండెర్వా పోలీస్ స్టేషన్ పరిధి చపియాలుటావన్ గ్రామానికి చెందిన హరేంద్ర(30) అనే వ్యక్తి మౌర్యకు వచ్చాడు. పోలీసు కారు రోడ్డు పక్కన ఖాళీగా ఉండటం, దానికే కీ ఉండటాన్ని గమనించాడు. మరోవైపు, పోలీసులు, జనం కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన హరేంద్ర.. పోలీస్ జీపును తీసుకుని పరారయ్యాడు. జీవును ఎవరో తీసుకెళ్తున్నారని గమనించిన డ్రైవర్ దీపేంద్ర అధికారులకు సమాచారం అందించాడు.