తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆలయంలో యువకుడి హత్య.. దారుణంగా పొడిచి.. శివలింగం దగ్గర పడేసి.. - యువకుడిని హతమార్చిన దుండగులు

శివాలయంలో ఓ యువకుడిని పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

murder
హత్య

By

Published : Oct 3, 2022, 10:54 PM IST

మధ్యప్రదేశ్ గ్వాలియర్​లో దారుణం జరిగింది. శివాలయానికి వెళ్లిన ఓ యువకుడిని పదునైన ఆయుధంతో పొడిచారు గుర్తు తెలియని దుండగులు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జనక్​గంజ్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్న రింకూ అనే యువకుడు సోమవారం ఉదయం శివాలయానికి వెళ్లాడు. ఆయన ఇంటి సమీపంలోనే ఈ దేవాలయం ఉంది. అయితే ఎవరో గుర్తు తెలియని దుండగులు రింకూను పదునైన ఆయుధంతో పొడిచి ఆలయంలోని శివలింగం దగ్గర పడేశారు. ఈ క్రమంలో దేవాలయానికి వచ్చిన భక్తులు రక్తపుమడుగులో ఉన్న రింకూను చూసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రింకూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జనక్​గంజ్​ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

రింకూ సీఏ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. బాధితుడికి ఓ అన్న, ఇద్దరు అక్కలు ఉన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే అతడి తండ్రి ఏడేళ్ల క్రితమే ట్రాన్స్​ఫార్మర్​ పేలి మృతి చెందాడు. రింకూ ఇద్దరు అక్కలకు వివాహం జరిగింది. రింకూకు ఎవరూ శత్రువులు లేరని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దేవాలయంలో హత్య జరిగిందన్న విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు భారీగా గుమిగూడారు.

ఇవీ చదవండి:ఈ శునకం ధర రూ.10 కోట్లు.. కిలోమీటరుకు మించి నడవదు.. రోజంతా ఏసీలోనే..

45ఏళ్ల తర్వాత కలిసిన పూర్వవిద్యార్థులు.. ఒకే వేదికపై 108 మందికి షష్టిపూర్తి

ABOUT THE AUTHOR

...view details