తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేమపై పగ.. మతం వేరని హత్య.. యువకుడ్ని రాళ్లతో దారుణంగా కొట్టి... - పరువు హత్య

వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం ఆ యువకుడి ప్రాణాలు బలిగొంది. యువతి కుటుంబసభ్యులు అతడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ దారుణం కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో జరిగింది.

d
d

By

Published : May 26, 2022, 11:12 AM IST

దేశంలో వరుస పరువు హత్యలు వెలుగుచూస్తున్నాయి. బిహార్​లో ఓ బాలికను కన్నతండ్రే దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం బయటపడింది. వేరే మతానికి చెందిన యువతిని ప్రేమించినందుకు ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. యువతి కుటుంబీకులే ఈ దారుణానికి పాల్పడ్డారు. కర్ణాటకలోని కలబుర్గి జిల్లా వాడీ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ జరిగింది..: వాడీలోని భీమానగర్​కు చెందిన విజయ కాంబ్లే.. మరో వర్గానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. కానీ అందుకు యువతి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఇతర మతానికి చెందిన కాంబ్లే తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబసభ్యులు కాంబ్లేను హత్య చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కాంబ్లేను ఓ రైల్వే బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి హత్య చేశారు. రాళ్లు, ఇటుకలు సహా పలు ఆయుధాలతో తీవ్రంగా కొట్టడం వల్ల రక్తస్రావమై కాంబ్లే అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. కాంబ్లే హత్య నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు తీవ్రతను దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఉండేందుకు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదీ చూడండి :కల్తీ మద్యం కలకలం.. నాలుగురోజుల్లోనే 17 మంది మృతి!

ABOUT THE AUTHOR

...view details