కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ బాలికను బెదిరించి.. యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అదే ప్రాంతానికి చెందిన నౌఫాల్గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం..

నిందితుడు నౌషాల్కు బాధితురాలితో 2018లో పరిచయం ఏర్పడింది. బాలికతో స్నేహం చేసిన నిందితుడు.. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. అలా వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపించి బాధితురాలిని బెదిరిస్తూ ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు.
బాలిక ఇటీవల ఆమె తల్లిదండ్రులకు చెప్పడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పోక్స్ చట్టం కింద అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి :దారుణం.. 9వ తరగతి బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం