ఆన్లైన్ రమ్మీలో నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా తిరుపూర్లో శుక్రవారం రాత్రి జరిగింది. రైలు కింద పడి తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ మేరకు వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు. మృతుడుని ఎల్విన్ పాట్రిక్గా గుర్తించారు.
జూదం తీసిన ప్రాణం - మరో యువకుడు బలి - తమిళనాడు
అన్లైన్ జూదం మరో ప్రాణం తీసింది. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఆన్లైన్ రమ్మీలో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
జూదం తీసిన ప్రాణం - మరో యువకుడు బలి
ఆన్లైన్ రమ్మీకి బానిసైన ఎల్విన్, రూ. 7 లక్షలు పొగ్గొట్టుకున్నాడని తెలిపారు. అప్పుల భారం పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. పట్టాల నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో తమిళనాడులో ఈ తరహా ఘటనలు పెరుగుతుండటం గమనార్హం. రమ్మీని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా, వివిధ మార్గాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్నారు.
ఇదీ చూడండి :ఆన్లైన్ రమ్మీకి మరో ప్రాణం బలి!