Youth Dies On Bike: మధ్యప్రదేశ్లోని అలీరాజ్పుర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. బైక్పై నుంచి కిందపడి చనిపోయిన యువకుడ్ని ఎవరూ పట్టించుకోలేదు. ఒక రాత్రంతా అలాగే రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
బైక్ నడుపుతూ మృతి.. రాత్రంతా రోడ్డుపైనే శవం.. వారంతా చూసినా... - Youth dies on bike in madhyapradesh
Youth Dies On Bike: బైక్పై నుంచి అకస్మాత్తుగా పడి చనిపోయాడో యువకుడు. ఈ ఘటనను చూసినా.. ఎవరూ పట్టించుకోలేదు. రాత్రంతా బాధితుడ్ని అలాగే రోడ్డుపైనే వదిలేశారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
కారుకు సైడ్ ఇచ్చే క్రమంలో ఓ యువకుడు బైక్పై నుంచి అకస్మాత్తుగా పడి చనిపోయాడు. మొదట అతడికి సహాయం చేయడానికి కొందరు స్థానికులు అక్కడి వచ్చి లేపే ప్రయత్నం చేశారు. కానీ ఆ యువకుడు లేవలేదు. దీంతో అతడ్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కనీసం అంబులెన్స్ లేదా పోలీసులకు సమాచారం కూడా అందివ్వలేదు. ఆ రాత్రంతా అతను అలాగే రోడ్డుపై ఉండిపోయాడు. ఆదివారం ఉదయం ఓ బాటసారి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:భార్యను టీజ్ చేశాడని.. హత్య చేసి, మంటల్లో కాల్చేసి...