తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియురాలిపై అనుమానంతో హత్య.. ఆపై యువకుడు ఆత్మహత్య - raipur new

ప్రియురాలిపై అనుమానంతో ఓ యువకుడు ఆమెను బ్లేడుతో గొంతు కోసి హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో జరిగింది.

murder
murder

By

Published : Jul 13, 2022, 9:50 PM IST

ఛత్తీస్​గఢ్​.. రాయ్​పుర్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రేమిస్తున్న యువతిపై అనుమానంతో ఓ యువకుడు.. ఆమెను సుత్తితో గాయపరిచి, బ్లేడుతో గొంతుకోసి హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం..రాయ్​పుర్​లోని పాత బస్తీ ప్రాంతంలో 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న కమలేశ్​, అర్చన ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఒక్కసారిగా కోపం పెంచుకున్న కమలేశ్​.. అక్కడే ఉన్న సుత్తితో అర్చనను గాయపరిచాడు. అంతటితో ఆగకుండా బ్లేడుతో ఆమె గొంతు కోశాడు.

ఆ తర్వాత చాలా సేపు వరకు ఎటువంటి మాటలు వినిపించకపోవడం వల్ల అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు కొట్టారు. ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. వచ్చి తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లగా ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. యువకుడి మృతదేహం పక్కనే.. సూసైడ్​ నోట్​ లభ్యమైంది. తామిద్దరం ప్రేమికులమని, ఆమెపై అనుమానం రావడం వల్లే హత్య చేశానని యువకుడు సూసైడ్​ నోట్​లో రాశాడు. మృతదేహాల్ని పోలీసులు.. పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:అక్కా అని పిలిచి అర్ధరాత్రి 'ఆమె'పై మృగాడి దాడి.. రెండు కళ్లు పొడిచేసి..

ABOUT THE AUTHOR

...view details