తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువకుడికి మూడో పెళ్లి.. వివాహమైన మరుసటి రోజే రైల్వే ట్రాక్​పై.. - ట్రైన్​లో ఉన్న ప్రయాణికుడి మెడలో దిగిన ఇనుప రాడ్డు

పెళ్లైన మరుసటి రోజే రైల్వే ట్రాక్​పై మృతదేహంగా కనిపించాడు ఓ యువకుడు. ఈ విషాద ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది. మరోవైపు, రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి మెడలో ఇనుప రాడ్డి దిగింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన దిల్లీలో జరిగింది.

youth dead body in railway track
మర్డర్

By

Published : Dec 2, 2022, 6:55 PM IST

రాజస్థాన్‌ జైపుర్​లో దారుణం జరిగింది. వివాహమైన తర్వాత రోజే రైల్వే ట్రాక్​పై విగతజీవిగా కనిపించాడు నవవరుడు. మృతుడిని శ్రవణ్ కుమార్(30)గా గుర్తించారు పోలీసులు. సోమవారం జరిగిందీ ఘటన. శ్రవణ్​ను హత్య చేసి రైల్వే ట్రాక్​పై పడేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు వధువు సహా ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రవణ్ కుమార్​కు అంతకుముందు రెండు వివాహాలు జరిగాయి. అతడి మొదటి భార్య మరణించగా.. రెండో భార్యను వదిలేశాడు. ఆదివారం.. ఉత్తర్​ప్రదేశ్​లోని మిర్జాపుర్​కు చెందిన యువతిని మూడో వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి ఫొటోలను కుటుంబ సభ్యులకు పంపాడు. మీర్జాపుర్​ నుంచి నాగౌర్​కు వస్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. అంతలోనే సోమవారం ఉదయం శ్రవణ్ మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించింది. వధువు పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. శ్రవణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు.

ప్రయాణికుడి మెడలో రాడ్డు..
మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే నిదర్శనం. అప్పటి వరకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన వ్యక్తి అప్పుడే రైలెక్కాడు. గాలి చక్కగా తగులుతుందనేమో.. విండో సీట్‌లో కూర్చున్నాడు. అదే అతడి పాలిట మృత్యుపీఠమైంది. రైలు వేగంగా వెళ్తుండగా.. అనుకోకుండా ఓ ఇనుప చువ్వ కిటికీ అద్దాలను పగులగొట్టుకుంటూ వ్యక్తి మెడలో చొచ్చుకుపోయింది. ఏమైందో అక్కడున్న వారికి తెలిసేలోగానే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన దిల్లీలో జరిగింది.

రైలు బోగీలో ఉన్న ప్రయాణికుడి మెడలో దిగిన ఇనుప చువ్వ

హరికేశ్‌ దుబే అనే వ్యక్తి ఇవాళ ఉదయం దిల్లీ నుంచి కాన్పుర్‌ వెళ్లే నిలనాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌ పరిధిలోని దన్వర్‌-సోమ్నా స్టేషన్ల మధ్యలో ఒక ఇనుప చువ్వ హఠాత్తుగా బోగీలోకి దూసుకొచ్చి.. హరికేశ్‌ మెడలోకి చొచ్చుకుపోయింది. క్షణాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అలీగఢ్‌ జంక్షన్‌లో రైలును ఆపి.. మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. కొన్ని చోట్ల ట్రాక్‌ను సరిచేసేందుకు ఉపయోగించే ఇనుపకడ్డీ బోగీలోకి దూసుకొచ్చిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

బైక్​పై వచ్చి..
ఉత్తరాఖండ్​ నైనితాల్​లో దారుణం జరిగింది. బైక్​పై వచ్చిన యువకులు 12వ తరగతి విద్యార్థినిపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిందీ ఘటన. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details