కర్ణాటక శివమొగ్గలో దారుణం జరిగింది. ఓ యువకుడు కొడవలితో భజరంగ్‌దళ్ కార్యకర్తపై దాడికి యత్నించాడు. సోమవారం ఉదయం జరిగిందీ ఘటన. ఈ దాడిలో సునీల్ అనే భజరంగ్‌దళ్ కార్యకర్త ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సునీల్.. భజరంగ్‌దళ్ సాగర్ సిటీ కో-కన్వీనర్‌గా ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సాగర్ కొత్త బస్టాండ్‌లో సమీపంలో ఉన్న భజరంగ్‌దళ్ కార్యాలయానికి సునీల్ బైక్‌పై వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు సునీల్‌ను దగ్గరకు పిలిచాడు. బైక్‌లో నుంచి కొడవలిని తీసి అతడిపై దాడికి ప్రయత్నించాడు.
'నేను ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్తున్నాను. ఈ సమయంలో ఓ యువకుడు నన్ను అసభ్యంగా దూషించాడు. అతడి దగ్గరకు నేను బైక్‌పై వెళ్లగా కొడవలితో నాపై దాడికి యత్నించాడు.' అని సునీల్ తెలిపాడు.