మహారాష్ట్రలో హోలా మొహల్లా కార్యక్రమానికి అనుమతించలేదనే కారణంతో కొంతమంది యువకులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. నాందేడ్‌లోని గురుద్వారా వద్ద ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్ర పోలీసులపై యువకుల దాడి - మహారాష్ట్రాలో పోలీసులపై యువకుల దాడి
హోలా మొహల్లా కార్యక్రమానికి అనుమతించలేదనే కారణంతో కొంతమంది యువకులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర, నాందేడ్‌లోని గురుద్వారా వద్ద ఈ ఘటన జరిగింది.
పోలీసులపై సిక్ యువకుల దాడి
కొవిడ్ కారణంగా పోలీసులు హోలా మొహల్లా కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. గురుద్వారా లోపలే కార్యక్రమం నిర్వహించుకోవాలని గురుద్వారా కమిటీకి సమాచారంఇచ్చారు. అయితే సాయంత్రం నాలుగు గంటల సమయంలో లోపలి నుంచి దాదాపు 400 మంది యువకులు గురుద్వారా గేట్లను బద్దలుకొట్టుకునివచ్చి అక్కడున్న పోలీసులపై దాడిచేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై కేసు నమోదైన చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:కారు-ఆటో ఢీ.. నలుగురు సజీవ దహనం
Last Updated : Mar 29, 2021, 11:32 PM IST