ఈ వారం (సెప్టెంబరు 19 - 25) రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు మీకోసం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
మంచి పనులు చేసే అవకాశం లభిస్తుంది. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అధికార లాభం సూచితం. ఆశయం నెరవేరుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికస్థితి మెరుగవుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. గృహ వాహనాది లాభాలుంటాయి. ఇంట్లో వారితో గొడవపడవద్దు. శివస్మరణ మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
మనోబలం విజయాన్నిస్తుంది. పనులను వాయిదా వేయవద్దు. నిజాయతీ కాపాడుతుంది. ధనలాభం ఉంది. శ్రమ ఎక్కువ అవుతుంది. అవాంతరాలను సమర్థంగా ఎదుర్కోవాలి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. ఉత్సాహంగా ఉండండి. అపార్థాలకు తావివ్వకుండా ఓర్పుతో సంభాషించాలి. ఇష్టదైవ ధ్యానంతో మేలు జరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశముంది. నూతన ఆలోచనలు శక్తినిస్తాయి. వెతుకు తున్నది వెంటనే దొరుకుతుంది. కొత్తవారి పరిచయాలు లాభాన్నిస్తాయి. ఆర్థికంగా స్థిరపడతారు. విఘ్నాలను సమర్థంగా ఎదుర్కోవాలి. గణపతి స్మరణ మంచిది.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
శ్రేష్ఠమైన కాలం. ఉద్యోగంలో అద్భుతంగా ఉంటుంది. పలువిధాలుగా విజయం లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ధనధాన్య లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో కలిసివస్తుంది. పదిమందికీ మేలు చేసే అవకాశముంటుంది. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. ఇష్టదైవాన్ని స్మరించండి, అంతా మంచే జరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
అదృష్టకాలం నడుస్తోంది. విశేషమైన శుభాలున్నాయి. సుఖశాంతులు లభిస్తాయి. సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపూ వ్యాపారలాభమూ ఉంటాయి. సకాలంలో స్పందించండి. దేనికీ వెనుకాడవద్దు. తోటివారి సహకారం లభిస్తుంది. సమష్టి నిర్ణయాలు మంచిది. ఇష్టదేవతాధ్యానం కార్యసిద్ధినిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)
మంచికాలం. మిత్రుల సహకారంతో విజయం సాధిస్తారు. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆశయాలు నెరవేరతాయి. సౌమ్య సంభాషణ మేలు. అన్ని రకాలుగానూ అభివృద్ధి ఉంటుంది. ఆదిత్యహృదయం చదవండి, ఆనందంగా ఉంటారు.